calender_icon.png 28 October, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

28-10-2025 08:24:27 AM

241 గ్రాముల గంజాయి స్వాధీనం

జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్

జడ్చర్ల : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జడ్చర్ల టౌన్ సిఐ కమలాకర్(Jadcherla Town CI Kamalakar) తెలిపారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఆర్ఎన్సిసి యూనిట్, ఈగల్ టీం,  జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం ఎన్ హెచ్ 44 హైవే వద్ద  గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించడం జరిగిందన్నారు. అబ్దుల్ రెహమాన్ టీ స్టాల్(Abdul Rahman Tea Stall) వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు గంజాయి కొనుగోలు, విక్రయ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తేలిందని పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన,  చెందిన మరికంటి సుమంత్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, బీహార్ రాష్ట్రానికి చెందిన శుభోద్ కాంత్ శర్మ, సత్తు యాదవ్ కుమార్ వీరు గంజాయి కొనుగోలు,విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి నే స్థానంలో హాజరు పరిచినట్లు తెలిపారు. మాదకద్ర వేల దరిదాపుల్లోకి కూడా ఎవరు పోకూడదని ఆరోగ్యంగా వచ్చిన పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు. చట్ట విరుద్ధమైన పనులు చేసి కటకటాల పాలు కాకూడదని ప్రజలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆర్ఎన్సీసీ యూనిట్, ఈగల్ టీం  జడ్చర్ల పోలీస్ ఎస్ఐ ఖాదర్,  విష్ణు, భారత, నరసింహ, కాశీనాథు, వీరేశ్ లని జిల్లా ఎస్పీ డి. జానకి ప్రత్యేకంగా అభినందించారు.