17 July, 2026 | 5:19 PM

నాయకమ్మ ఆలయంలో హరీశ్‌రావు పూజలు

04-06-2024 03:34 AM

సిద్దిపేట రూరల్, జూన్ 3: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో జరుగుతున్న నాయకమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం ప్రతినిధులు ఆయనను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు జన్మదిన వేడుకలు

పటాన్‌చెరు/గజ్వేల్/జహీరాబాద్, జూన్ 3: హరీశ్‌రావు జన్మదిన వేడుకలను పటాన్‌చెరు నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తదితరులు హరీశ్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

  1. హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని గజ్వేల్‌లో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్లవాగు హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జెడ్పీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఎంకమల్ల ప్రణీత్ చికిత్స కోసం మాదాసు శ్రీనివాస్ రూ.50 వేలు, గజ్వేల్ 19వ వార్డు కౌన్సిలర్ రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. 
  2. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్‌రావు, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్ తదితరులు హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.