17 July, 2026 | 5:29 PM

నిజామాబాద్ డీఎస్వోగా పద్మ

04-06-2024 03:32 AM

డీఎంగా రాజేందర్ నియామకం

బాధ్యతలు చేపట్టిన కొత్త అధికారులు 

నిజామాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా (డీఎస్వో) సీ పద్మ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా (డీఎం) డీ రాజేందర్ నియామకం అయ్యారు. సోమవారం అధికారులు ఇద్దరూ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా డీఎస్‌వోగా ఉన్న చంద్రప్రకాశ్,  డీఎంలు జగదీశ్‌కుమార్ అవినీతి ఆరోపణలతో సస్పెం డ్ కావడంతో ప్రభుత్వం జిల్లాకు కొత్త అధికారులను కేటాయించింది. నిజామాబాద్ డీఎస్వోగా బాధ్యతలు చేపట్టిన సీ పద్మ హైదరాబాద్ సివిల్ సప్లు కార్యాలయంలో డిప్యుటేషన్ పై కొనసాగుతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌గా కొనసాగుతున్న డీ రాజేంధర్‌ను ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎంగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అధికారులకు పౌరసరఫరాల సంస్థ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.