16 March, 2026 | 9:07 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రైతులు రోడ్లపాలు.. మంత్రులు గాలి మోటార్లలో: హరీశ్ రావు

09-11-2024 06:01 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): రైతు దీక్షలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆరు గ్యారంటీలు అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, బాండ్ పేపర్, గ్యారంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. మూసీ ప్రారంభస్థానం నుంచే పాదయాత్ర చేద్దామని సీఎంకు సవాల్ చేశారు. కాంగ్రెస్ హయంలో రైతులు రోడ్లపాలు, చిన్నారులు ఆసుపత్రిపాలు, పోలీసులు రోడ్లెక్కతున్నారు, మంత్రులేమో గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నారని హరీశ్ రావు ఆరోపణలు చేశారు. మంత్రులు భూమిపై తిరిగితే ప్రజల కాష్టాలు తెలుస్తాయని, ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవాలు చేస్తామంటున్నారు. ఆ విజయోత్సవాలు ఎంందుకు చేస్తారో చెప్పాలి..? అని అడిగారు. ప్రజలను మోసం చేసినందుకు విజయోత్సవం చేసుకుంటారా..?  అని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100 సీట్లు గెలుస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.