calender_icon.png 22 October, 2024 | 9:14 PM

జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు

10-07-2024 05:07:45 PM

హైదరాబాద్: జర్నలిస్టులపై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అన్నారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే జర్నలిస్టుల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.