calender_icon.png 17 February, 2026 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరోం.. హర..

16-02-2026 12:00:00 AM

  1. శివనామస్మరణతో మారు మోగిన శైవక్షేత్రాలు
  2. భక్తవ శంకరుడికి ప్రణమిల్లిన భక్తులు
  3. త్రినేత్రుడికి రుద్రాభిషేకాలు, లింగోద్భవ పూజలు
  4. కనుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవాలు
  5. శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించిన వేద పండితులు
  6. శివనామ స్మరణతో వేడుకలను తిలకించిన భక్తజనం
  7. భక్తులతో పోటెత్తిన ఆలయాలు, ఉపవాస, జాగరణ దీక్షలు
  8. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మణుగూరు, ఫిబ్రవరి 15,(విజయక్రాంతి) : శివ శివ శంకరా.. భక్తవ శంకరా.. బ్రహ్మ మురారీ సురార్చిత లింగం,హరహర మహాదేవ.. శంభోశంకర..’ అంటూ సాగిన శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి.  జిల్లావ్యాప్తంగా  ఆదివారం  మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా సాగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శైవక్షేత్రాలు కిక్కిరిశాయి. వేకువ జామునుంచే భక్తు లు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి త్రినే త్రుడిని దర్శించుకున్నారు. 

రుద్రాభిషేకాలు, శివపార్వతుల కల్యాణం, లింగో ద్భవ పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేశారు. ప్రధానంగా మణుగూరుతో పాటు పినపాక మండలంలో శైవాలయాలు ఎంతో ప్రసిద్ది చెందడంతో పాటు కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాలు కావడంతో భక్తులు మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వ రుడిని దర్శించుకోవడానికి  ప్రధాన ఆలయాలకు  పోటెత్తారు. 

భక్తవ శంకరుడికి ప్రణమిల్లిన భక్తులు..

మణుగూరు లోని కాకతీయ రాజులతో పూజలు అందుకున్న  పురాతన  శ్రీ నీల కంఠేశ్వర స్వామి దేవాలయం, పవిత్ర గోదావరి నది తీరాన కోలువు తీరిన కొండాయిగూడెం గ్రామంలోని  శ్రీ శ్రీ శ్రీ భ్రమ రాంబ సమేత శ్రీ వైద్యానాథ లింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పినపాక మండ లంలోని సీతంపేట రాజరాజేశ్వరి శివాలయం, చింతల బయ్యారం గోదావరి తీరాన గల శ్రీ ఉమా సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం, పాల్వంచలోని చింతలచెరువు వద్ద గల ఆత్మలింగేశ్వర ఆలయం,బూర్గంపాడు మండ లంలోని మోతెగడ్డ వీరన్న  ఆలయాలు  తెల్లవారు జాము నుండి భక్తులతో కిటకి టలాడాయి.

ఆయా శివాలయాలలో పరమశివుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తాయి. తెల్లవారు  జామున లేచి పవిత్ర గోదావరిలో స్నాన మాచరించిన  భక్తులు మహాశివు ని దర్శించుకున్నారు. వేలాదిగా తరలివచ్చి శివుడికి ఇష్టమైన పంచామృతాలతో  శివలింగాలకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ దేవాలయంలో చూసిన భక్తులు రద్దీ ఉండడంతో పాటు హర హర మహా దేవా శంటో శంకరా... అనే స్మరణలతో దేవాలయాలు హోరెత్తి పోయాయి.

జనసంద్రమైన శివాలయాలు...

మహా శివరాత్రి  శివుడికి అత్యంత ప్రీతి కరమైన రోజు కావడంతో భక్తులు  ఉత్సా హంగా శివరాత్రి వేడుకలలో పాల్గొని ఆయా చోట్ల త్రినేత్రుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, శివపార్వతుల కల్యా ణం, లింగోద్భవ  పూజలు చేసి, మొక్కు లు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలు ఓం నమో శివాయ స్మరణలతో మారుమ్రోగాయి. ఆలయ ప్రధాన అర్చకులు రుద్రాభిషేకాలు, ప్రత్యే క పూజలు నిర్వహించి ఆనంతరం కళ్యా ణోత్సవం చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా  దైవ దర్శనానికి గంటల పాటు భారీకేడ్ల మధ్య బారులు తీరి భక్తులతో దేవాలయాలు జనసంద్రమ య్యాయి. యువతి, యువకులు, మహిళలు, ఎక్కువగా దేవాలయాలకు తరళి రావడంతో కిటకిటలాడాయి. ఎక్కడా చూసిన భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ నెలకొంది.

ప్రత్యేక పూజలు, మొక్కులు..

భక్తులు శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు చెల్లింపులు జరపడం కనిపిం చింది. కొంత మంది భక్తులు రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సుముఖత చూపారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు చేసి తరిస్తున్నారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహా శివ రాత్రి  శోభతో పండుగ వాతా వరణం నెలకొంది.

కనుల పండువగా కల్యాణోత్సవాలు..

మహా శివరాత్రి సందర్భంగా శైవాలయా ల్లో శివపార్వతుల కల్యాణం  అర్ధరాత్రి కన్నుల పండువగా జరిగింది. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధం గా.. వేద పండితుల మంతోచ్ఛారణల మధ్య నిర్వహించిన స్వామివారి కల్యా ణాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. జాగారంతో నిత్యం శివనామ స్మరణ చేస్తూ కల్యాణ తంతును కనులారా వీక్షించారు.

మండ లంలోని  నీలకంఠేశ్వర శివాలయం, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ వైద్యనాధేశ్వర  స్వామి ఆలయం,  కాశీ విశ్వేశ్వర ఆల యం, పినపాక మండలంలోని చింతల బయ్యారం శ్రీ ఉమా సమేత నీలకంఠే శ్వర  ఆలయం, రాజరాజేశ్వరి ఆలయా లలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. నీలకం ఠేశ్వర  శివాలయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంప తులు  సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

శివాలయాలలో  కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. స్వచ్ఛం ద సేవా సంస్థలు, ఆలయ కమిటీలు   భక్తులకు ప్రసాద వితరణ చేయగా  భక్తు ల రద్దీ నేపథ్యంలో అవాంఛనీయ ఘటన లు జరగ కుండా పోలీసులు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.