వైభవ్ తమ్ముడు మరో సెంచరీ
సమస్తిపూర్, జూన్ 24 : ఒకవైపు 15 ఏళ్లకే వరల్డ్ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న వైభవ్ సూర్యవంశీ శుక్రవారం టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేయబోతుంటే మరోవైపు అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా చెలరేగిపోతున్నాడు. పదేళ్లకే సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ శతకం సాధించాడు. రిషవ్ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశీర్వాద్ కేవలం 119 బంతుల్లో 19 ఫోర్లు, 6 సిక్సర్లతో 168 పరుగులు చేశా డు.
వైభవ్‌లానే ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆశీర్వాద్ విధ్వంసం సృష్టించడంతో రిషవ్ ఎలెవన్ భారీ విజయాన్ని అందుకుంది. కాగా తమ్ముడికి సంబంధించిన సెంచరీ స్కోరు కార్డును సోషల్ మీడియాలో వైభవ్ అభిమానులతో పంచుకున్నాడు. ఆశీర్వాద్ ఇటీవలే తేజ్‌పూర్ క్రికెట్ అకాడమీ తరపున 87 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఇప్పుడు మరో సెంచరీ బాదేశాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ భారత జాతీయ జట్టు లో చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోవడం త్వరలో నే చూస్తామంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.






