28 June, 2026 | 12:27 PM

Breaking News

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లపై వేధింపులు ఆపాలి: పీవైఎల్   •   పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •  

జేఈఈ ఫలితాల్లో ‘హార్వెస్ట్’ సత్తా

03-06-2025 12:12 AM

విద్యార్థులకు ఉన్నత శ్రేణి ఫలితాలు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): 2025 విద్యాసంవత్సరానికి గాను జేఈ ఈ అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ ప్రవేశ అర్హత పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించినట్లు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం సోమవారం ప్రకటనలో తెలిపింది.

సోమవారం ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేట గిరీల్లో బీ సాయిచరణ్ 83వ ర్యాంకు, బీ సం జయ్ 207 ర్యాంకు, ఎం నాగయశ్వంత్ 393వ ర్యాంకు, బీ సిద్దార్థ్ 395వ ర్యాంకు, డీ శ్రీనివాసగౌతమ్‌రెడ్డి 686వ ర్యాంకు, వీ చరణ్ గోపాల్ స్వామి 1092 ర్యాంకు, బీ మోక్షజ్ఞ 1159వ ర్యాంకు, పి.క్రిష్ సాత్విక్ 1163వ ర్యాంకు, ఎ గణేష్ 1195వ ర్యాంకు, ఎన్‌సి హెచ్ జస్వంత్ సాయి 1268వ ర్యాంకు,

ఎన్ రాఘవేంద్ర నవనీత్ 2108 ర్యాంకు, పి ప్రేమ్‌వర్థన్ 5078వ ర్యాంకు, వీ సాయిదీపక్ 6001వ ర్యాంకు, టీ శ్రీనినాథ్ 14629 ర్యాంకు సాధించారని తెలిపారు. వారిని కళాశాల ఆవరణలో హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీ రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి అభినం దించారు. 

హార్వెస్ట్ పాఠశాలలో రాష్ట్ర అవతరణ వేడుకలు

ఖమ్మం పాకబండ బజార్‌లోని హార్వెస్ట్ పాఠశాలలో సోమవారం రాష్ట్ర అవతరణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీ రవి మారుత్ హాజరై జాతీ య జెండాను ఎగురవేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణోత్సవం ఘనంగా జరుపుకోవడం ఆనంతదాయకమని చెప్పా రు.

ప్రత్యేక తెలంగాణ కొంత అభివృద్ధిని సాధించిందని, ఇంకా ఎంతో సాధించాల్సిన అవసరం ఉందన్నారు. చదువు ప్రాధాన్యతను, ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండవలసిన అవసరాన్ని తెలియజేశారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గర్హనీయన్నారు.

కార్య క్రమంలో ప్రిన్సిపాల్ ఆర్ పార్వతి, వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, స్నేహ గారు, శ్యామల, జాకీర్, సెప్ ఇన్‌చార్జి ఉమా మహేశ్వర్‌రావు, నాగరాజు, ప్రైమరి ఇన్‌చార్జ్ మానస, టెండర్ రూట్స్ హెచ్‌ఎం అసీమా, ఎకడమిక్ ఇన్‌చార్జి ఉషశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.