ప్రధానిని కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
27-06-2024 12:25 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో దేశం మరింతగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ మనుమరాళ్లతో మోదీ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మనుమరాళ్లు పాట పాడారు.






