24 April, 2026 | 7:21 AM

ప్రోత్సాహకాలు కీలకం

27-06-2024 12:27 AM

పరిశ్రమల శాఖ ప్రత్యేక పీఎస్ జయేశ్ రంజన్

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): పరిశ్రమలకు ప్రోత్సాహకా లు చాలా కీలకమని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. వ్యాపార ప్రోత్సాహకాల కోసం సమగ్ర విధానం అవసరమని చెప్పారు. బుధవారం బేగంపేటలో సీఐఐ తెలంగాణ 6వ సీఎఫ్‌ఓ కాన్‌క్లేవ్‌కు జయేశ్‌రంజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  రాష్ట్రంలో వ్యాపార అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన వెంటనే నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చని తెలిపారు.