1 April, 2026 | 12:45 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

మరో మ్యాచ్ గెలిచిన హర్యానా

30-11-2024 12:00 AM

నోయిడా: హర్యానా స్టీలర్స్ 42-30 తేడాతో తమిళ్ తలైవాస్ మీద ఘన విజయం సాధించింది. హర్యానాలో వినయ్ 9 పాయింట్లు సాధించాడు. తమిళ స్టార్ రెయిడర్ సచిన్ పాయింట్ల ఖాతాను తెరవలేకపోయాడు. డిఫెండర్ షఫాఘీ 11 పాయింట్లతో పోరాడినా కానీ తమిళ జట్టు కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తమిళ రెయిడర్లు దారుణంగా విఫలమయ్యారు.

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చంద్రన్ రంజిత్ (4) రెయిడింగ్‌లో పర్వాలేదనిపించాడు. తొలి నుంచే ఆధిపత్యం కనబర్చిన హర్యా నా చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పునేరి పల్టన్ 34-33 తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయ ఢంకా మోగించింది. మొదటి నుంచి నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరికి ఒక్క పాయింట్‌తో గెలిచి పునేరి ఊపిరిపీల్చుకుంది.

పునేరిలో రెయిడర్ ఆకాశ్ షిండే (12) సూపర్ టెన్‌తో మెరిశాడు. గుజరాత్ ఫస్ట్ హాఫ్‌లో సమర్పించుకున్న అదనపు పాయింట్ జట్టు ఓటమికి కారణం అయింది. నేడు పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.