09-02-2026 02:33:36 AM
ఇన్‌స్టా బ్యూటీ ఇమాన్వీ ఇస్మాయిల్ తొలి సినిమాకే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు హీరోయిన్‌గా మారింది. ‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా దర్శకుడు హను రాఘవపూడి ఈ మద్దుగుమ్మను ఎంపిక చేయగానే.. ఆమె అదృష్టం మామూలుగా లేదు అంటూ పలువురు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇక ఇప్పుడు ‘ఫౌజీ’ నిర్మాణంలో ఉం డగానే మరో భారీ అవకాశం ఈ అందాలభామను వరించినట్టు తెలుస్తోంది.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్వీ అయితే బావుంటుందనే అభిప్రాయాన్ని పవన్‌తో సురేందర్‌రెడ్డి వ్యక్తం చేశారట. పవన్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని టాక్. ఈ విషయంలో తాను పట్టించుకోనని, పాత్రకు ఎవరు సూట్ అయితే.. వారినే ఎంపిక చేయమని పవన్ చెప్పారట. దీంతో ఇమాన్వీ ఎంపిక దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అదృష్టం ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయ నేది మరోమారు ఇమాన్వీ విషయంలో నిరూపితమవుతోంది.