calender_icon.png 9 February, 2026 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి మాటల్లో అంతా విషమే

09-02-2026 02:37:54 AM

  1. ఎలాంటి విషయం లేదు!

హామీలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగాలి

సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారం

సదాశివపేట/జహీరాబాద్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8: సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో విషం తప్పా విషయం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 26 నెలల ప్రజాపాలనలో ఒరగబెట్టింది ఏమీలేదని మాజీ మంత్రి హరీశ్‌రా వు నిప్పులు చెరిగారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సంద ర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగిరేది ఖా యమన్నారు. కాలనీలలో చెత్త కూడ సరిగ్గా డంపు చేయని దద్దమ్మ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి పాలన చేస్తున్నాడని, హామీల గురించి అడిగితే లాగుల తొం డలు వదులుతా, పేగులు మెడలో వేసుకుం టా అని అహంకారంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నదన్నారు.

రెండేళ్ళలో సదాశివపేట పట్టణంలో ఐదు వేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, గెలిపిస్తే పేదలకు ఇండ్ల స్థలాల పొజీషన్ చూపిస్తానని జగ్గారెడ్డి డ్రామా చేస్తున్నారని విమర్శిం చారు. పేదలమీద ప్రేమ ఉంటే 2014లోనే ఇచ్చేవాడని, ఎన్నికల్లో ఓడిపాయాక జగ్గారెడ్డి 2025 వరకు కనిపించకుండా పోయాడ న్నారు.  కేసీఆర్ రూ.2000 పెన్షన్ ఇస్తే, రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడనీ, ఆ డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడిగే హక్కు మీకు  ఉంటుందన్నారు.

ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ చొరవతో రూ. 37 కోట్లతో మిషన్ భగీరథ తెచ్చి రోజుకోసారి నీళ్లు వచ్చేలా చేశామని, 50 పడకల ఆసుపత్రి కట్టించామని, బస్టాండ్ ను బాగుచేశా మని, ఊబ చెరువు, కందకం రోడ్డు, గల్లీల్లో మోరీల కోసం రూ. 25 కోట్లు ఇచ్చి అభివృ ద్ధి తమ హయాంలో చేశామన్నారు. ము న్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు.

కార్యక్రమంలో ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్, బీఆర్‌ఎస్ నాయకులు స పాన్‌దేవ్, మఠం బిక్షపతి, చింతా గోపాల్, చీల మల్లన్న, శివరాజ్‌పాటిల్, చింత సాయి తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ ము న్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల అభ్యర్థుల గెలుపు కోసం కార్నర్ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ తెచ్చిన అభి వృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు.

నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎన్నికల ఇంచార్జ్ దేవి ప్రసా ద్, నామ రవికిరణ్, అంజిమ్,  మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,  తట్టు నారాయణ పాల్గొన్నారు.