calender_icon.png 9 February, 2026 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషిచేస్తా

09-02-2026 02:35:06 AM

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి అజారుద్దీన్

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ కృషి ఎనలేనిదని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 12 మంది కౌన్సిలర్లను ప్రజలు గెలిపించుకు ని తీరాలని, ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవాలని ఆయన అన్నా రు.

ఎల్లారెడ్డిలో ఏటీసీ సెంటర్, మినీ ట్యాం క్ బండ్ వంటి పనులు ఎన్నో జరుగుతున్నాయని ఇంకా అభివృద్ధి చేయడం స్థానిక ఎమ్మెల్యే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, అభ్యర్థులు మతమాల భాగ్యవతి, మునుగొండ శ్రీనివాస్, తిరుపతి, పద్మ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.