15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

దుబ్బాకలో భైరవ మంత్రపీఠం

09-02-2026 02:37 AM
  1. దుబ్బాక విఠలాలయంలో యోగభైరవ, కాళికల శిల్పం
  2. దేశంలోనే అరుదైన భైరవ ప్రతిమ

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) :  పాశుపత శైవం పద్దెనిమిది మంది ఆచార్యులతో దేశమంతా విస్తరించింది. తాత్వికపరమైన భేదాలతో కాపాలిక, కాలాముఖ అనే రెండు ప్రధాన వర్గాలుగా తర్వా త కాలంలో విడిపోయింది. రహస్య పూజా విధానాలతో కాపాలిక ఆరాధన అనేది కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. ప్రత్యా భిజ్ఞా-వర్గమ్ కాలాముఖ ఉపశాఖకు కారణం. కాలాముఖులు సాత్వికమైన ఆరాధనా విధానాలతో దేవాలయాలు, మఠాలను నిర్మించారు.

నాటికే తెలుగు రాష్ట్రాల్లో కాలముఖ ప్రస్థానం మొదలైనది. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో ఆధిపత్యమతంగా కొనసాగింది. కాలాముఖంలో పరిషత్తులు వాటిలో పర్వతావళి, భుజంగావళి ఉపశాఖలు ఏర్పడ్డాయి. దేవి, శక్తి, దుర్గ, అంబిక, గౌరీ, అపర్ణ, పార్వతి, కాళి ఇత్యాది పేర్లతో మహా శివుని భైరవ రూపానికి పత్నిగా ఆ యా దేవీ రూపాలతో ఆరాధించబడ్డ 51 పీ ఠాల విశేషాల్ని, 42 పవిత్ర ఆలయాల గురిం చి తంత్ర చూడామణి చెప్తుంది.

కాలాముఖుల్ని ప్రస్తావించిన శాసనాలు అనేకం

కాలాముఖుల్ని ప్రస్తావించిన శాసనాలు తెలంగాణలో చాలా లభించాయి. కాలాముఖుల సంప్రదాయంలో విస్తరించి తర్వాత కాలానికి శాసనాలతో నమోదు గాక మిగిలిపోయిన ఆలయాల్లో ఒకటి కొత్తగా వెలు గు చూసింది. సిద్ధిపేట జిల్లా మండలకేంద్రం దుబ్బాక వాస్తవ్యుడు, కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు సిరిపురం నరేందర్ తమ గ్రామంలో విఠలేశ్వరాలయంగా పిలువబడుతున్న శైవాలయంలో శివలింగ పీఠమ్ మీద కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పాన్ని గుర్తించాడు.

ఈ శిల్పం సుఖాసీన మూర్తులలో భైరవుడు పర(వెనక)హస్తాలలో పరశువు, శ్వానపతాకాన్ని, నిజ(ముందరి)హస్తాలలో కుడిచేత అక్షమా ల ధరించి, ఎడమచేత ప్రసారితహస్తంతో దర్శనమిస్తుంటే, దేవి ఖట్వాంగంతో, ప్ర సారిత హస్తముతో కనిపిస్తుందని, ఈ శిల్పం ప్రతిమాలక్షణాలపరంగా యోగభైరవ, కాళికలని ప్రతిమాలక్షణవేత్త పి.మహేశ్, శ్రీరా మోజు హరగోపాల్ నిర్ధారించారు. జయదుర్గతో క్రోధభైరవుడు, మహిష మర్ధినితో వ క్త్రనాథుడు, యశోరేశ్వరితో చండభైరవుడు, మహాపీఠ నిరూపణలో కామరూప ఆరాధనలో కనిపించే జంటలలో మొదటిది కాళీ, యోగేశ భైరవుడుంటారని వివరించారు.

ప్రతిమను పొరపాటుగా..

ప్రతిమను పొరపాటుగా వైష్ణవమూర్తిగా కొలుస్తున్నారు. ప్రతిమ లక్ష ణాలు ఎరుగకపోవడం వల్ల జరిగిన తప్పిదం. తెలంగాణాలోనే గతంలో ల భించిన ఏదులాబాద్ 9తలల చండభైరవుడు, ఇంద్రేశంలో స్వచ్ఛందభైరవుల స్థానాలు గొప్ప భైరవ మంత్రపీఠాలే. ఇప్పుడు దుబ్బాకలో 3వ భైరవమంత్రపీఠం గుర్తించబడ్డది. నాలుగో పీఠాన్ని అన్వేషించ వలసివుంది. దేశంలో ఇటువంటి భైరవమంత్ర పీఠాలున్నా సమా చారం లేదు.