ఏరువాక సాగారో..!
- వానకాలం సాగుకు రైతన్నల సన్నద్ధం
- విత్తనాలు ఎరువులకు అధికారుల అంచనాలు
కరీంనగర్, మే 26 (విజయ క్రాంతి): రో హిణికార్తె ఆగమనంతో వానాకాలం సీజన్ ప్రారంభం జావడంతో రైతులు సాగుకు స న్నద్ధం అవుతున్నారు. ఎలాంటి పంటలు పండించాలి, ఏ రకం విత్తనాలు వేయాలి, పంట పెట్టుబడుల సేకరణ తదితర విషయాలపై రైతులు తలమునకలు అవుతారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఖరీఫ్ సాగు ప్ర ణాళికను రూపొందించారు. అందుకు తగ్గ ట్లుగా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుక వచ్చేందుకు అంచనాలు తయారు చేశారు.
కరీంనగర్ జిల్లాలో...
కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలం సీజ న్లో వరి 2,79,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. అలాగే మొక్కజొన్న 4500 ఎక రాల్లో, పత్తి 48000 ఎకరాల్లో, ఇతర పం టలు 12, 920 ఎకరాల్లో సాగు చేయనున్నా రు. మొత్తం ఈ ఖరీఫ్ సీజన్లో 3,44,420ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయను న్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
పెద్దపల్లి జిల్లాలో...
ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,78,290 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని అం చనా వేశా రు. మూడు వానాకాలం సీజన్లలో సగటున 2,75,990 ఎకరాల్లో పంటలు సాగు చేశారని, ఈసారి అదనంగా 2,300 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకా శాలున్నాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ప్రతి సీజన్లో వరి, పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న పంటలు అధికంగా పండిస్తున్నారు.
2,15,500 ఎకరాల్లో వరి, 52,094 ఎకరాల్లో పత్తి, 886 ఎకరాల్లో మొక్కజొన్న, 208 ఎకరాల్లో కంది, 10 ఎకరాల్లో పెసర, 11 ఎకరాల్లో మినుములు, 12 ఎకరాల్లో ఇతర పంటలు, 2 ఎకరాల్లో వేరుశెనగ, 44 ఎకరా ల్లో నువ్వులు, 3179 ఎకరాల్లో ఆయిల్పామ్, 133 ఎకరాల్లో మిర్చి, 295 ఎకరాల్లో ప సుపు, 376 ఎకరాల్లో ఇతర పప్పు దినుసు లు, 5,128 ఎకరాల్లో కూరగాయలు, 415 ఎకరాల్లో ఇతర పంటలను రైతులు పండించనున్నారని అధికారులు అంచనా వేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ శా ఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రైతులకు అ వసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంట లు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91వేల 366 ఎకరాలు, పత్తి 47,120ఎకరాలు, పెస ర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3,430 ఎకరాలు, ఇతర పంటలు 5,593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనావేశారు.
జగిత్యాల జిల్లాలో...
జిల్లాలో 4,24,470 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 3,15,768 ఎకరాల్లో వరి, 34,059 ఎకరాల్లో మొక్కజొన్న, 19, 897 ఎకరాల్లో పత్తి, మిగతా పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.






