ఇంటర్ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పు
27-05-2026 12:00 AM
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఇంటర్‌లో సవరించిన పాఠ్యపుస్తకాల్లో కొత్తగా చేర్చిన అంశాల వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, కన్నడ, మ్యాథమెటిక్స్-1ఏ, మ్యాథమెటిక్స్1బీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, కామర్స్, అకౌంటెన్సీ, పబ్లిక్‌అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫి సబ్జెక్టుల్లోని పలు అంశాలను మార్పులు చేర్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.






