17-05-2025 12:09:20 AM
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్న ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. టీమ్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విష్ణు మంచు యూఎస్‌లో ప్రమోషనల్ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక కన్నప్ప కథ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో దాన్ని కామిక్ బుక్స్ రూపంలోకి కూడా తీసుకొ చ్చారు.
ఈ కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు మూడో అధ్యాయాన్నీ విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను తెలియజేసేలా ఉంది. కన్నప్పగా మారే క్రమంలో తిన్నడి ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో ఆకట్టుకు నేలా ఉంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఇంతకు మించి ఉంటాయని టీమ్ చెబుతోంది.