20 August, 2026 | 2:44 AM

పీరియడ్స్ విషయంలోనూ హేళన చేశాడు!

20-08-2026 01:50 AM

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా, అది రెండు భాగాలుగా విడుదలైంది. ఇంటర్వ్యూ తొలి భాగంలో అనుపమ.. తన మాజీ భాగస్వామి తనను ఎంతగా మానసిక కుంగుబాటుకు గురిచేశాడో చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ రెండో భాగం విడుదలైంది. ఇందులో అనుపమ మరిన్ని షాకింగ్ విషయాలు పంచుకుంది. “అతని తప్పులను నేనెప్పుడు నిలదీసినా.. ‘ఓహో.. నీకు పీరియడ్స్ సమయమా? మూడ్ స్వింగ్స్ వల్ల ఇలా మాట్లాడుతున్నావా?’ అని హేళన చేసేవాడు. ఆ మాటల వల్ల ఒక మహిళగా, నటిగా నాపై నాకే అసహ్యం వేసేది.

ఈ బంధం వల్ల తన వృత్తిగత జీవితం కూడా దెబ్బ తిన్నది. సోషల్ మీడియా పోస్టులకూ అతని అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఒక దశలో తీవ్ర ఒత్తిడి వల్ల బరువు తగ్గిపోయానని, సర్జరీ వరకు వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పుడు నాకు పెద్ద కుటుంబం కావాలని, 11 మంది పిల్లలను కనాలనే కల ఉండేది. కానీ ఈ చేదు అనుభవం తర్వాత అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి నా మనస్తత్వం మారిపోయింది. తమ బంధం మొదలైన మూడు నెలలకే నిశ్చితార్థం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ, నేను నిరాకరించి సమయం అడిగాను. ఒకవేళ ఆ రోజే పెళ్లికి అంగీకరించి ఉంటే ఈపాటికి విడాకులు అయ్యేవి” అని చెప్పుకొచ్చింది. ఇక చివరగా అనుపమ.. ప్రస్తుతం ఆ చేదు జ్ఞాపకాలను, డిప్రెషన్‌ను వెనక్కి నెట్టి తన కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్టు తెలిపింది.