1 May, 2026 | 7:21 PM

Breaking News

ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు కాజేసారు

09-12-2024 08:58 PM

ప్రజావాణికీ 95 ఫిర్యాదులు...

నిజామాబాద్ (విజయక్రాంతి): వైద్యాఆరోగ్యశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద నుండి డబ్బు తీసుకొని మోసం చేశాడని నగరంలోని ముజాయిద్ నగరమునకు చెందిన నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థిని రజీయ సుల్తానా (24) బాదితురాలు సోమావారం ప్రజావాణిలో పిర్యాదు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి ఒకరు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని లక్ష యాబైవేలు డిమాండ్ చేయగా నలబైవేల రూపాయిలు ఇచ్చానని తన పిర్యాదులో పేర్కోన్నారు. ఈ విషయము నగర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కోన్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తు వచ్చే పిర్యాదులను సత్వరమే పరిష్కారించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయల్లో సోమావారం నిర్వహించిన ప్రజావాణీ కార్యాక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లా వివిద ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల విషయమై అదనపు కలెక్టర్ తో పాటు ఆర్‌డివో సాయగౌడ్, ఆర్‌డివో రాజేందర్ కుమార్, ఇంచార్జ్ డిపివో శ్రీనివాస్, బోదన్ ఏసిపి శ్రీనివాస్, మెప్మా పిడి రాజేందర్ లకు అర్జీలు పెట్టుకున్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిద శాఖల అధికారులు ప్రజలు పాల్గోన్నారు.