1 May, 2026 | 5:42 PM

వెలిమినేడులో పేలిన రియాక్టర్‌.. 9 మంది కార్మికులకు గాయాలు

01-05-2026 04:25 PM

నల్గొండలో Nosch Labsలో రియాక్టర్ పేలుడు

హైదరాబాద్: మేడే రోజే కార్మికులకు ఘోర ప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా( Nosch Labs) ల్యాబ్ లో శుక్రవారం జరిగిన పేలుడులో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. కంపెనీలోని మూడవ బ్లాక్‌లో ఒక రియాక్టర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రియాక్టర్ పేలిన తర్వాత ఆ బ్లాక్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS)కు తరలించారు. గాయపడిన కార్మికులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మే 1 కార్మిక దినోత్సవం నాడు కంపెనీలో పనిచేసిన కార్మికులు, కార్మిక సంఘాల నుండి విమర్శలను ఎదుర్కొన్నారు.  ఇదే ఫార్మా కంపెనీలో ఏప్రిల్ 9న రెండో బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు సంభవించడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 20 రోజుల్లో రెండోసారి ప్రమాదం జరిగడం విశేషం. వరస ప్రమాదాలు ప్రమాదాలు జరిగాయని కార్మికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.