1 May, 2026 | 8:25 PM

మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేవరకు పోరాడుతాం.....

01-05-2026 07:06 PM

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు

 సీఐటీయూ సీనియర్ నాయకులు ఎంవి అప్పారావు

పాల్వంచ,(విజయక్రాంతి): మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నాలుగు లేబర్ కోడ్ల ఉపసంహరణకు ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సం మేడే సందర్బంగా వివిధ కార్మికవాడల్లో జండావిష్కరణలు చేస్తూ నవభారత్ ప్రధాన గెట్ వద్ద జండావిష్కరణ చేసి  తరువాత దొడ్డా రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో  మధు, ఎం.వి అప్పారావులు మాట్లాడుతూ కేంద్రంలోని  బిజెపి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్నాయని వాటిని వెంటనే రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు.

వివిధ పరీశ్రమల్లోని కార్మికులకు సరైన  వెతనాలు ఇవ్వకపోవడం, పనిభద్రత లేకపోవడంతో దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు గా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు . పాల్వంచ ప్రాంతంలో పెద్ద పరిశ్రమగా ఉన్న  నవభారత్ ఫెర్రో అల్లాయిస్, నవ 260 మెగావాట్ల విద్యుత్ కర్మాగారంలో కేవలం 47 మంది శాశ్వత  ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, వారికి కూడా రూ 20 వేల వేతనానికి మించిలేదని ఇదే పరిశ్రమలో షుమారు 2000మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వీరికి కనీసవేతనాలు అమలవ్వడంలేదని  పే స్లిప్లు , పిఎఫ్   స్లిపులు ఇవ్వరని ఈఎస్ఐ కార్డులు పత్తవుండవని, అడిగితే నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదని బెదిరింపులకు పాల్పడుతూ, మానసికంగా ఇబ్బందులకు గురిచేతోందని వారు ఆరోపించారు.

కొన్ని యూనియన్ల ను సపోర్ట్ చేస్తూ ప్రశ్నించే యూనియన్ల సభ్యులను కౌన్సెలింగ్ పేరుతో బెదిరిస్తూన్నారని,   విద్యుత్ కర్మాగారం రెండు యూనిట్లలో 260 మేఘావాట్ల  విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కోట్లాది రూపాయలు లాభాల రూపేణా పోగేసుకొనే యాజమాన్యం ఒక్క శాశ్వత కార్మికుడిని కూడా నియమించకుండా చట్టల ఉల్లంఘన పాల్పడుతున్నారు అన్నారు.  ఒక్క మహిళా ఉద్యోగి కూడా లేనిఎకైక పరిశ్రమగా "నవ"వున్నదని, చట్టాలు తమ చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని కార్మిక శాకాధికారులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడానికి యూనియన్లతో యాజమాన్యం చర్చలకు రావాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సర్వీస్ పరిగణలోకి తీసుకొని శాశ్వత ఉద్యోగులుగా  నియమించాలని, మిగతా వారి నైపుణ్యాలు ఆధారంగా విభజన చేసి ఆయా  నైపుణ్యాలకు అనుగుణంగా వేతన నిర్దారణ చేయాలని  డిమాండ్ చేశారు.