3 May, 2026 | 12:49 PM

ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు కాజేశాడు

10-12-2024 12:46 AM

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిపై యువతి ఫిర్యాదు

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, తన నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడని నిజామాబాద్ నగరంలోని ముజాయిద్ నగర్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని రజీయా సుల్తానా సోమావారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి ఒకరు తన కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.80 వేలు డిమాండ్ చేశారని, మొదటగా రూ.40 వేలు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ విషయమై నగర వన్ టౌన్ పోలీస్ స్టేష్‌న్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు.