3 May, 2026 | 2:05 PM

డిప్యూటీ సీఎం ఒక్క రుపాయీ ఇవ్వట్లే

10-12-2024 12:46 AM
  1. ‘బీ వెల్లంల’కు నిధులిచ్చి పూర్తి చేశాం కదా..
  2. అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి, భట్టి మధ్య ఆసక్తికర చర్చ 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య అసెంబ్లీ లాబీల్లో అసక్తికర చర్చ జరిగింది. ‘ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు ఏమి అడిగినా ఒకే అన్నాడు.. ఇప్పుడు సెక్రటేరియట్‌కు పని కోసం వస్తే పైసలు లేవు’ అంటున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

వెంటననే భట్టి స్పందిస్తూ.. ‘నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు కోసం కోమటిరెడ్డి 2004 నుంచి పోరాడుతున్నాడు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడి ప్రాజెక్టును మంజూరు చేయించుకున్నారు. ఇప్పడు నిధులిచ్చి పూర్తి చేసినం. నల్లగొండ జిల్లాలో కూడా గోదావరి తరహా నీళ్లు పారబోతున్నాయి. వెంకన్న జన్మ ధన్యమైంది.

హైదరాబాద్‌లో ఆయన సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలి’ భట్టి సూచించారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తి కావడంతో అక్కడ భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. నాకు, తలా ఒక ఎకరం భూమి ఇవ్వవా? అని కోమటిరెడ్డిని భట్టి అడగడంతో అక్కడున్న వారు ఆసక్తిగా విన్నారు.