రేపు జైపూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
10-12-2024 12:44 AM
12, 13న ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం (రేపు) రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వెళ్లనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం జైపూర్ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడి నుంచి 12, 13 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
హస్తినలో ఏఐసీసీ పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకంతో పాటు రాష్ట్రంలోని రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.






