01-10-2024 12:26:58 AM
వివాహేతర సంబంధమే కారణం
వేముల, సెప్టెంబర్ 30: మంచం మీద నిద్రిస్తున్న ఓ వ్యక్తిని డిటోనేటర్లు పేల్చి చంపేశారు. ఈ ఘటన వైఎస్‌ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లి లో జరిగింది. స్థానికంగా వీఆర్‌ఏగా పనిచేస్తున్న నరసింహ తన ఇంట్లో మంచంపై పడుకున్నాడు. బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు.
దీంతో నరసింహ అక్కడికక్కడే మృతిచెందగా, ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను వేంపల్లి ప్రభుత్వాసు పత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. నరసింహను హతమార్చిన బాబును అదు పులోకి తీసుకొని విచారిస్తున్నారు.