10 March, 2026 | 6:13 AM

సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి ఏకగ్రీవం

10-03-2026 03:16 AM
  1. రాజ్యసభ సభ్యులుగా ధృవీకరణ పత్రాలు స్వీకరణ 
  2. అభినందనలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఆ పార్టీ సీనియర్ నేత, అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి తెలిపా రు. రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వీరికి అ సెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి ధృవీకరణ  పత్రాలు అందజేశారు.

సింఘ్వి ధృవీక రణ పత్రంను ఆయన తరఫున అడ్వకేట్ అం దుకున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, తు మ్మల నాగేశ్వర్‌రావు, వాకిటి శ్రీహరి, ప్రభు త్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎన్నికైన వీరికి మం త్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 9తో రాజ్యసభకు తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విష యం తెలిసిందే. తెలంగాణలోనూ ఖాళీ అ య్యే రెండు స్థానాలకు కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి నామి నేషన్లు వేయగా, స్వతంత్ర అభ్యర్థిగా సాయి నామినేషన్ దాఖలుచేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పోటికి దూరంగా ఉన్నది.

నిబంధనల ప్రకారం రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సాయికి ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో తిరస్కరణ కు గురైంది. ఇక సోమవారంతో నామినేషన్ల ఉప సంహరణ గడువు కూడా ముగియడంతో ఇద్దరు అభ్యర్థులను ఎన్నికల రిటర్నిం గ్ అధికారి విజేతలుగా గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వి ప్రస్తు తం రాజ్యసభలో సిట్టింగ్ సభ్యుడిగా ఉన్నా రు. పార్టీ అవసరాల దృష్ట్యా సింఘ్విని తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభ సభ్యు డిగా అవకాశం ఇచ్చింది.

సమస్యలపై పోరాట్ంత: నరేందర్‌రెడ్డి 

తెలంగాణ సమస్యల మీద రాజ్యసభలో తన వాణిని వినిపిస్తానని రాజ్యసభ సభ్యు డు వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ధృవీకరణ పత్రం అందు కున్న అనంతరం వేం నరేందర్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమ స్యలు పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. రాజ్యసభసభ్యుడిగా అవకాశం కల్పించిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గేతోపా టు కాంగ్రెస్ పెద్దలు, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీ సీ అధ్యక్షుడు మహేష్‌కు మార్‌గౌడ్, మంత్రు లు, ఎమ్మెల్యేల, సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడాలి: మంత్రి శ్రీధర్‌బాబు 

అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి అనుభవజ్ఞులైన నాయకులని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాజ్యసభకు ఎంపికైన సింఘ్వి, నరేందర్‌రెడ్డికి శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో  విభ జన చట్టంలోని అంశాలపై కేంద్రంతో పోరా టం చేయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పార్లమెంట్‌లో కొట్లాడాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా వీరికి సోని యగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు పలికిన కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలకు సీఎల్పీ తరఫున శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.