calender_icon.png 8 November, 2024 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏడుగురు దుర్మరణం

01-10-2024 10:01:00 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి  గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స నిమిత్తం  ఆదిలాబాద్ లోని రిమ్స్ తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.