calender_icon.png 19 September, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

19-09-2025 09:19:24 AM

హైదరాబాద్: ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులకే రక్షణ కరువైంది. పోలీసులపై(Police) ప్రజలు దాడులు చేసే రోజులోచ్చాయి. నిర్మల్ జిల్లా కుబీర్ పోలీస్ స్టేషన్(Kubeer police station)లో హెడ్ కానిస్టేబుల్(Head constable)పై కత్తితో దాడి జరిగింది. అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ నారాయణపై దాడి చేశాడు. ప్రస్తుతం అబ్దుల్ కలీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన నారాయణను భైంసా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్ కలీమ్ కానిస్టేబుల్ నారాయణపై ఎందుకు దాడి చేశాడన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.