19-09-2025 08:46:59 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ఢిల్లీలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో సీఎం భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం బిజినెస్ స్టాండర్స్ వార్షిక ఫోరంలో సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం అమెజాన్, కార్ల్స్ బర్గ్, కార్లైల్ , గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడులపై చర్చించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈవో, నార్వే మాజీ మంత్రి బోర్జ్ బ్రెండేతో సీఎం సమావేశం కానున్నారు.