14-06-2025 09:03:00 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం కాసిపేట పీహెచ్సీలో యోగ డైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాసిపేట పిహెచ్ సి డా. శ్రీవిద్య మాట్లాడారు. నిత్యం యోగ చేయడం వల్ల కలిగే ఉపయోగాలతో పాటు, యోగ డైట్ పాటించడం వల్ల ప్రయోజనం అపూర్వమన్నారు. యోగ డైట్ వల్ల శారీరక మానసికంగా ఆరోగ్యాన్నిపొందవచ్చు అన్నారు. సాత్విక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. యోగ డైట్ ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. యోగ డైట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డా శ్రీవిద్య, ఫార్మసిస్ట్ లు, పిహెచ్ సి సిబ్భంది,యోగ ఇన్స్ట్రక్టర్ నాగార్జున, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.