పరిశుభ్రతతోనే ఆరోగ్యం
04-08-2026 11:54 AM
- లక్ష్మాపూర్‌లో ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీ
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు లక్ష్మాపూర్‌లో మంగళవారం కౌన్సిలర్ కొలిచెల్మి భవాని కరుణాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భవాని కరుణాకర్, మాజీ సర్పంచ్ కొలిచెల్మి స్వామి మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంటి చెత్తను పరిసరాల్లో వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు పరుశురాం, గ్రామస్తులు పాల్గొన్నారు.






