4 August, 2026 | 12:45 PM

ఏఎస్‌రావు నగర్‌లో నిలిచిన నీటిని తొలగించిన పోలీసులు

04-08-2026 11:52 AM

ఉప్పల్,(విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా ఏఎస్‌రావు నగర్‌లోని అనూ టెక్స్ సమీపంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. అలాగే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులకు ఉపశమనం లభించింది.