19 April, 2026 | 2:46 AM

విస్తరిస్తున్న లివర్ వ్యాధులు

19-04-2026 01:04 AM
  1. ముగ్గురిలో ఒకరికి ప్రమాదం

మెడికవర్ ఆసుపత్రి నిపుణుల హెచ్చరిక

ట్రాన్స్‌ప్లాంట్ కంటే నివారణే ఉత్తమమన్న డాక్టర్. కిశోర్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): దేశంలో వేగంగా పెరు గుతున్న లివర్ (కాలేయ) వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండా లని మెడికవర్ ఆసుపత్రి పేర్కొంది. వరల్డ్ లివర్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ లివర్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మెడికవర్ హాస్పిటల్స్ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉంద ని, కాలేయ మార్పిడి నిపుణుడు స ర్జన్ హెడ్‌ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ జీఐ, హెచ్‌పీబీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాం ట్ విభాగం డాక్టర్ కిశోర్ రెడ్డి తెలిపారు.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివ ర్ డిసీజ్ ప్రస్తుతం అత్యంత సాధారణ లివర్ వ్యాధిగా మారింది. అధి కంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, ఊబకా యం, మధుమేహం, మద్యం సేవించడం వంటివి ప్రధాన కారణాలు కాగా, దీని ప్రబలత 50 శాతం వరకు నమోదవుతుంది. లివర్ వ్యా ధిలో ఆరంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవని, వ్యాధి తీవ్ర దశకు చేరుకున్న తరువాతనే గుర్తించబడుతుందని, నిర్లక్ష్యం చేస్తే సిరో సిస్, లివర్‌ఫెయిల్యూర్, లివర్ క్యా న్సర్ లాంటివాటికి దారితీసే ప్రమా దం ఉందని హెచ్చరించారు.

అదేతరుణంలో 70 శాతం కంటే ఎక్కువ లివర్ వ్యా ధులను నివారించడం సాధ్యమేనన్నారు. సమతుల్య ఆహా రం, రోజూ 30 నిమిషాల వ్యాయా మం, బరువు నియంత్రణలో ఉం చుకోవడం, మద్యం పూర్తిగా నివారించడం, అవసరం లేని మందులు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సమయానుసారం వైద్యచెకప్, లివ ర్ టెస్టులు చేయించుకోవడం అవసరమన్నా రు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రాణాలను రక్షించే మార్గమే అయి నా, నివారణే ఉత్తమ చికిత్సగా నిలుస్తుందని డాక్టర్ కిశోర్‌రెడ్డి స్పష్టం చేశారు.