12 March, 2026 | 7:33 AM

బయోటెక్నాలజీతోనే ఆరోగ్య భారత్

12-03-2026 12:23 AM

ప్రొఫెసర్ రాహుల్ నారంగ్ 

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సు

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): దేశ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చడంలో, ప ర్యావరణాన్ని కాపాడటంలోనూ బయోటెక్నాలజీ పాత్ర వెలకట్టలేనిదని యాదాద్రి భు వనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ డీన్ అకాడమిక్స్ ప్రొఫెసర్ రాహుల్ నారంగ్ అన్నా రు.

భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం “ద బయోకల్చరల్ బ్రిడ్జ్: వై ద ఫ్యూచర్ ఫర్ ఇండియా ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ” అనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాహుల్ నారంగ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ఇతర రంగా ల సాంకేతికతను బయోటెక్నాలజీకి జోడించినప్పుడే ప్రపంచ స్థాయి ఆవిష్క రణలు సా ధ్యమవుతాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ఎదుర్కోవాలంటే ముం దస్తు నిర్ధార ణ పరికరాలు, టీకాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొత్త రకమైన వ్యాధులకు కారణమవుతున్నాయని ప్రొఫెసర్ రాహుల్ నారంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి “బయో-రెమిడి యే షన్‌” వంటి పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరముందన్నారు. అనంతరం రాహుల్ నారంగ్‌ను యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు సత్కరించారు.