calender_icon.png 20 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద మహిళలకు వినికిడి యంత్రాలు అందజేత

20-01-2026 06:10:32 PM

వలస నీలయ్యకు కృతజ్ఞతలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని పూసాల రోడ్డులో జరిగిన కార్యక్రమంలో గత కొంతకాలంగా వినికిడి సమస్యలతో బాధపడుతున్న పూసాల గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద మహిళలు పిట్టల శారద, వద్దంటి శారద లకు జిల్లా చీఫ్ కో.ఆర్డినేటర్ లయన్ వలస నీలయ్య తన సొంత ఖర్చు సుమారు 12 వేల రూపాయలతో రెండు వినికిడి యంత్రాలను క్లబ్ సభ్యులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా వినికిడి యంత్ర గ్రహీతలు లయన్స్ క్లబ్బుకు, వలస నీలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు, 320 జి జి.ఈ.టి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా కో.ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, పిట్టల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.