calender_icon.png 17 November, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ బస్సు ప్రమాదం.. వివిధ ఆస్పత్రులకు మృతదేహాలు

17-11-2025 01:58:28 PM

హైదరాబాద్: సౌదీ బస్సు ప్రమాదంపై హైదరాబాద్ జాయింట్ సీపీ ఇక్బాల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.  సౌదీలో మరణించిన వారి మృతదేహాలను వివిధ ఆసుపత్రులకు తరలించారని, భారత దౌత్య అధికారులు ఆసుపత్రులకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్య అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం తీసుకుంటున్నామన్నారు.

తామ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 54 మంది హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్లారని, ప్రమాదంలో బస్సులో 46 ప్రయాణించగా, అందులో ఒక ప్రయాణికుడు మాత్రమే బతికి బయటపడ్డాడు. మిగతా వారందరూ మరణించారని హైదరాబాద్ జాయింట్ సీపీ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని జాయింట్ సీపీ ఇక్బాల్ వివరించారు.