26 June, 2026 | 1:48 PM

‘ఓటుకు నోటు’పై నాంపల్లి కోర్టులో విచారణ

14-06-2025 01:02 AM
  1. తదుపరి విచారణ జూలై 25కు వాయిదా 

వ్యక్తిగత హాజరు నుంచి సీఎం రేవంత్‌కు మినహాయింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): తెలుగు రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై శుక్రవా రం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వ్యక్తిగత హాజ రు నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి న్యా యస్థానం మినహాయింపునిచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఈ కేసు లో నిందితులుగా ఉన్న సెబాస్టియ న్, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్‌లకు కూడా కోర్టు విచారణకు హాజ రు కాకుండా మినహాయింపునిచ్చింది.

మరోవైపు విచారణకు నిందితులుగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్య హాజరయ్యారు. కేసు విచారణను వేగవంతం చేసి త్వరగా తే ల్చాలని వారు ఈ సందర్భంగా కో ర్టును కోరారు.

ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా విచారణను వాయిదా వే యాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పైకోర్టులో స్టే పొందాలని లేదా ఇక్క డి విచారణను కొనసాగించాలని స్ప ష్టం చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.