25 April, 2026 | 8:29 AM

లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా

29-11-2024 01:41 AM

వికారాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో జైలులో ఉన్న 21మంది రైతుల బెయిల్  పిటిషన్‌పై గురువారం వికారాబాద్ కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి రైతుల బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో ఏ ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.