16 June, 2026 | 2:36 AM

నేడు కూడ ఇంజినీరింగ్ కాలేజీల హియరింగ్

16-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించి టీఏఎఫ్‌ఆర్సీ హియరింగ్‌ను మరోసారి చేపట్టింది. మంగళవారం కూడా ఈ హియరింగ్‌ను నిర్వహించనుంది. తొలిరోజైన సోమవారం పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజుల అంశానికి సంబంధించి విచారణకు హాజరయ్యాయి. గతంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను తగ్గించడంతో దాదాపు 16 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్సీ హియరింగ్‌ను చేపట్టింది. నేడు కూడా మరికొన్ని కాలేజీలు హాజరుకానున్నాయి.