16 June, 2026 | 2:37 AM

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి..

16-06-2026 12:00 AM

స్వగ్రామస్తులతో ఎమ్మెల్యే

బోథ్ జూన్ 15( విజయక్రాంతి): నన్ను కన్నది నా తల్లితండ్రులైతే పెంచింది మీరు .మీ వాకిళ్లలో ఆడుకున్నాను మీతో కలిసి తిరిగాను మీ సహకారంతో నేను ఇంతటి వాడిని అయ్యాను. మీకు నేను ఏమిచ్చి రుణం తీసుకోవాలో అర్థం కావడం లేదు అని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు.

మంగళవారం 16న ఎమ్మెల్యే జన్మదినం కావడం వల్ల ఒకరోజు ముందుగానే ఆయన స్వగ్రామస్తులు రాజుర కు చెందినవారు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోటార్ సైకిల్ ర్యాలీతో వచ్చి ఆడపడుచులు మంగళ హారతులు చేతబట్టి ఎమ్మెల్యేను గ్రామంలోకి వాంకిడి ఎక్స్ రోడ్డు నుండి తీసుకువెళ్లారు.

ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదలాగా ఎమ్మెల్యే పై పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి తీసుకువెళ్లారు గ్రామంలో గజమాలను ఎమ్మెల్యే మెడలవేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరు చూపించిన ఆధార అభిమానాలు జీవితంలో మర్చిపోలేను అన్నారు. మీ అభిమానం ఎల్లవేళలా ఇలాగే ఉండాలని గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు.