16 June, 2026 | 2:38 AM

నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు

16-06-2026 12:00 AM

భారీగా విత్తన ప్యాకెట్ల స్వాధీనం

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠాను పోలీసుకు అరెస్టు చేసి, భారీ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సమావేశ మందిరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్న 9 మందిపై టు టౌన్ పోలీస్ స్టేషన్ లోకేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరి నుండి నకిలీ పత్తి విత్తనాలు, అనుమతులు లేని పురుగు మందులు, ఎక్స్పైర్డ్ విత్తనాలు, తయారీ సామగ్రి, ఓ కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చే సుకున్నట్లు వెల్లడించారు.

పట్టుబడ్డ 792 విత్తన ప్యాకెట్ల పింక్ బాండ్ కంపెనీ పేరుతో పత్తి విత్తనాల ప్యాకెట్లు లభ్యమయ్యేని, వాటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందన్నారు. నిం దితుల్లో సందేశ్ బండేవర్, పాపిన్వర్ సునీల్ కుమార్, రాథోడ్ పండిత్, రాథోడ్ బాలాజీ, గిరీష్ పటేల్, ఈశ్వర్, గణేష్, కృష్ణ, కిరణ్ లపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో కొందరిని అరెస్టు చేయగా. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రైతులను మోసం చేసి అక్రమ లా భాల కోసం నకిలీ విత్తనాల వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్త్స్రలు అఖిల్, తదితరులు పాల్గొన్నారు.