7 May, 2026 | 10:27 AM

వాకింగ్ చేస్తుండగా గుండెపోటు..

28-11-2024 12:47 AM
  1. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రసాద్ మృతి 
  2. మంత్రి పొంగులేటి, సీపీఎం, సీపీఐ నేతల నివాళి 

ఖమ్మం, నవంబర్ 27 (విజయక్రాంతి): సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఖమ్మంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

కుటుంబ సభ్యులు  ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోటు ప్రసాద్ సుదీర్ఘకాలం సీపీఐలో ఉంటూ వివిధ హోదాల్లో పని చేశారు. ప్రజా ఉద్యమాల్లో  పాల్గొన్నారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి వరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పూలమాల వేసి, నివాళులర్పించారు.