నూతన సర్పంచ్ కి ఆత్మీయ అభినందనలు
మాదిగ విద్యావంతుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొంగర ప్రభాకర్ మాదిగ..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన బరిగల బాబు తొలిసారి బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సందర్భంగా మాదిగ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గజ్జల మల్లేశం మాదిగ ఆదేశాల మేరకు మాదిగ విద్యావంతుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొంగర ప్రభాకర్ నూతన సర్పంచి బరిగెల బాబు ను కలిసి శాలువాతో సత్కరించి ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ఫలితంగానే మాదిగలకు అవకాశం వచ్చిందని దాని ఫలితమే ఇవాళ మాదిగలు పలు గ్రామాలలో సర్పంచులుగా పోటీ చేశారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ విద్యావంతుల వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




