calender_icon.png 13 December, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాస్‌మేట్ కుటుంబానికి రూ.41,600 అందజేత

13-12-2025 08:46:53 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కుర్ణ నగేష్ పది రోజుల క్రితం హఠాన్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నగేష్ క్లాస్‌మేట్స్ ఆ కుటుంబానికి అండగా నిలవాలని తలిచారు. ఈ మేరకు కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో నగేష్ తో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న 1991-92 టెన్త్ క్లాస్ విద్యార్థులు సంఘటితమై సేకరించిన 41,600 రూపాయలను శనివారం నగేష్ కుటుంబ సభ్యులకు అందజేసి అండగా నిలిచారు.