calender_icon.png 29 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడెక్కిన స్థానిక రాజకీయం

29-09-2025 12:58:13 AM

  1. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు
  2. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నాయకులు
  3. రిజర్వేషన్ల ఖరారుతో మారనున్న సమీకరణాలు
  4. గెలుపోటములపై అంచనాలు వేస్తున్న రాజకీయ పార్టీలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఎంతోకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహుల కు రిజర్వేషన్ల స్థానాలు ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.జిల్లాలో 15 మండలాల్లో జడ్పిటిసి ఎపీపి స్థానాలకు సంబంధించి ఎన్నికల అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రకటనతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాయకుల అంచనాలు కొన్నిచోట్ల తారుమారు కావడం తో గందరగోళంగా మారింది. 

ఎంతోకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న చోట్ల రిజర్వేషన్ మారడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేం దుకు వేగవంతంగా ముందుకు సాగడంతో పలు రాజకీయ పార్టీలు సైతం బలమైన నాయకుల వేటలో పడ్డాయి. శనివారం రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ప్రధాన పార్టీల అధినాయకులు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాగైనా గెలవాలని అధికార పార్టీ నాయకులు ఓవైపు వ్యూహం చేస్తుండగా బిఆర్‌ఎస్ పార్టీ జెండాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగర వెయ్యాలని ఆ పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తుండగా బిజెపి పార్టీ ముఖ్య నాయకులు సైతం ఎన్నికల్లో కాషాయం సత్తా చూపాలని చూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాన పార్టీ లు బలమైన అభ్యర్థులను నిలబెట్టి తమ సత్తాను చాటాలని ప్రణాళికలు వేస్తున్నారు.

దాదాపు రెండు సంవత్సరాలుగా స్థానిక సం స్థల ప్రాతినిథ్యం లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం జాప్యం జరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా స్థానిక సంస్థల్లో గెలుపొంది ప్రభుత్వానికి మరింత ఉత్తేజాన్ని నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ముందుకు వెళుతుంది.

స్థానికంలోనూ త్రిముఖ పోటీ...!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో స్థానిక సంస్థల లోనైనా కాంగ్రెస్ ప్రాతినిథ్యం ఉండాలని ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ముందు కు వెళుతుంది. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా సిర్పూర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ బాబు ప్రాతిని థ్యం వహిస్తున్నారు. 

బిఆర్‌ఎస్ బిజెపి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీల ఎమ్మెల్యేలు ముందు కు వెళుతున్నారు.రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది.

జెడ్పీ బీసీ జనరల్....!

జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించారు. నూతన జిల్లాలు ఏర్పా టు అయిన తర్వాత మొదటిసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ కి కేటాయించగా రెండవసారి చైర్మన్ ను బీసీ జనరల్ కు కేటాయించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ జనరల్‌కు కేటాయించడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 జడ్పి టిసి స్థానాలలో అత్యధిక స్థానాలను గెలిపించుకొని జడ్పీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయా లని అధికార పార్టీ నాయకులు యోచిస్తున్నా రు.

మొదటిసారి జరిగిన జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రెండవసారి కూడా జడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతుంది. 

ఎంపీపీ  రిజర్వేషన్..

లింగాపూర్, సిర్పూర్ యూ, ఆసిఫాబాద్, (ఎస్టీ మహిళ), జైనూర్, బెజ్జూర్, వాంకిడి (ఎస్టీ జనరల్), పెంచికల్ పెట్ (ఎస్సీ మహిళా), దహేగాం(ఎస్సీ జనరల్), చింతలమనేపల్లి, కాగజ్‌నగర్,(బీసీ మహిళ),సిర్పూర్ టీ,రెబ్బెన, కౌటల,(బీసీ జనరల్),తిర్యాణి(జనరల్), కెరమెరి (మహిళ జనరల్)

జడ్పీటీసీ రిజర్వేషన్లు...

ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమనే పల్లి(ఎస్టీ జనరల్) ,వాంకిడి,దహెగాం (ఎస్టీ మహిళ), సిర్పూర్ యూ(జనరల్),పెంచికల్ పెట్ (ఎస్సీ మహిళా), సిర్పూర్ టీ (ఎస్సీ జనరల్),రె బ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ (బీసీ మహిళ), జైనూర్, కెరమెరి (బీసీ జనరల్),లింగాపూర్ (జనరల్ మహిళ)కు కేటాయించారు.