29-09-2025 12:51:51 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి): ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుం టే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుం టే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిం చారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంభావం వల్లే తెలంగాణకు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లనుందని కేటీఆర్ విమర్శించారు.
ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్ మైనారిటీ నేతలతో కలిసి కేటీఆర్ ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి చేతకానితనం, మితిమీరిన అహంభావం కారణంగా రాష్ర్ట అభివృద్ధి గాడితప్పిందని, మెట్రోరైల్వే ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తీసుకుంటామన్న ప్రభుత్వం నిర్ణయం వలన పౌరులపై రూ. 15,000 కోట్ల భారం పడిందని ఆరోపించారు.
తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్‌సిటీ వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను రద్దు చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ అంశంలో అక్రమ కేసులు పెడతామని ఎల్ అండ్ టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారని, ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమే అని కేటీఆర్ ఆరోపించారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం ముఖ్యమంత్రి చావు తెలివితేటలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
జాతీ యటెలివిజన్‌లోనే స్వయంగా ఎల్ అండ్ టీ కంపెనీ సీఎఫ్‌ఓను జైల్లో పెట్టాల్సిందిగా పోలీసులను కోరానని గొప్పలు చెప్పుకున్నారని గుర్తుచేశారు.ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ర్టం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అని, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయ బ్ అవుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్‌ఎస్ నేతలే అని స్పష్టం చేశారు.
మోసాన్ని ‘బాకీ కార్డు ’తో గుర్తు చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటల ను మరిచిపోతారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు. కేటీఆర్, అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు ద ండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అధి కారం చేపట్టాక ఆడబిడ్డలు, వృద్ధులకు ఇప్పటి వరకు ఎంత బాకీ పడిందో వివరించారు.
బుద్ధి చెప్పకుంటే అరాచకాలే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. తెలంగాణలో అభివృద్ధే జరగడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని కేటీఆర్ చెప్పారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు.