19 August, 2026 | 10:11 PM

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

23-05-2024 07:12 AM

నిజామాబాద్/వనపర్తి/ఆదిలాబాద్/హనుమకొండ, మే 22 (విజయక్రాంతి): వర్షా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి, గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ బుధవారం ఇందల్వాయిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని గద్వా ల జిల్లా ప్రత్యేక అధికారిణి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని నీటిపారుదలశాఖ రాష్ర్ట కార్యదరి, నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.  ధాన్యం కొనుగోళ్లను నెలాఖరు వరకు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల, పరకాల మార్కెట్ యార్డులో కొనుగో లు కేంద్రాలను ఆమె పరిశీలించారు.