17 May, 2026 | 2:04 AM

పలు జిల్లాల్లో భారీ వర్షం

23-04-2024 01:24 AM

జిల్లా పరిధిలోని బానువ్సాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, పిట్లం, పెద్దకోడప్‌గల్ మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదాలపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలుచోట్ల చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మంచిర్యాల జిల్లాలోనూ అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.