తునికాకు ధర నిర్ధారణ

23-04-2024 01:23:12 AM

50 ఆకులకు రూ.3.03 చెల్లింపు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ వాసులు వేసవిలో తునికాకు సేకరించి, వాటిని కాంట్రాక్టర్లకు విక్రయించి జీవనం సాగిస్తుంటారు. తునికాకు సేకరించిన కాంట్రాక్టర్లు ఆదివాసీలకు చెల్లించే సొమ్ము విషయమై సోమవారం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గుండాల మండలం వెన్నెలబయలులో కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. గత ఏడాది కంటే ఈసారి 50 ఆకుల కట్టకు రెండు పైసలు పెంచుతూ రూ.3.03 చొప్పున చెల్లించేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. దీనిలో ప్రభుత్వం రూ.3 చొప్పున చెల్లించనుండగా, కాంట్రక్టర్ 3 పైసలు చెల్లించనున్నారు. అలాగే కళ్లేదారుల కమిషన్, హ్యాండ్లింగ్ చార్జీలు గత ఏడాది రూ.302.50 ఉండగా,  ఈసారి 10 శాతాన్ని పెంచి రూ 332.75 చొప్పున చెల్లించేందుకు అంగీకారం జరిగింది.